Powered By Blogger

Sunday, October 31, 2010

లూయివిల్ లో బాలల సాంస్కృతిక కార్యక్రమాలు ....

మా ఊర్లో (లూయివిల్ ) సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పిల్లలను ఎంకరేజ్ చేయడానికి చిన్న రైట్అప్ రాస్తున్నాను. ఈ వార్తను ఈనాడు కు కూడా పంపడం జరిగింది. లింక్ ఇస్తున్నాను. http://www.eenadu.net/story.asp?qry1=28&reccount=29
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కెంటకి రాష్ట్రం లోని లూయివిల్ లో బాలల దినోత్సవం సందర్భం గా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
కెంటకియాన తెలుగు సంఘం ఆధ్వర్యం లో "ఆటల పాటల సాయంత్రం" పేరుతొ జరిగిన ఈ కార్యక్రమం లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి.
కార్యక్రమానికి రఘు కొడుమూరి,రాధిక వేమ్మిరెడ్డి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చిన్నారులు ప్రదర్శించిన "బృందావనం" నృత్యరూపకం ఆహూతుల మన్ననలు పొందింది. డాక్టర్ రాజశేఖర్ లక్కరాజ్ ఆలపించిన ఘంటసాల సినీ గీతాలు అందరిని అలరించాయి. తెలుగు జానపద గీతాలకు అమెరికన్ యువతులు చేసిన నృత్యం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఏడు సంవత్సరాల "సూపర్ జీనియస్ కిడ్" మాస్టర్ ప్రణవ్ తన అసాధారణ ప్రతిభ తో ప్రేక్షకులను ఆశ్చర్యం లో ముంచెత్తాడు. ఈ అబ్బాయి ధారణ శక్తి  ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కన్నా ఎక్కువనీ, పది లక్షల మంది లో ఒక్కరికి ఇలాంటి సామర్థ్యం ఉంటుందని నిర్వాహకులు తెల్పారు (ఈ అబ్బాయి గురించి , మరో పోస్ట్ విడిగా రాయాలని ఉంది. తప్పకుండా రాస్తాను.) సంస్థ చైర్మన్ డాక్టర్ సురేష్ కొడాలి విజేతలకు బహుమతి ప్రధానం చేసారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~













2 comments:

Ramu S said...

మిత్రమా...
మీరు ఏ బ్యాచ్ లో ఈనాడు జర్నలిజం స్కూల్ లో chaduvukunnaru? nenu koodaa aa gooti pakshine.

raamu
apmediakaburlu.blogspot.com

Sasidhar said...

రాము గారు,
నా బ్లాగ్ లో, మీ కామెంట్స్ చూసాను. చాలా థ్యాంక్స్. నేను, ఈనాడు జర్నలిజం స్కూల్ లో 1995 జూన్ - 1996 ఫిబ్రవరి బ్యాచ్.
నేను, మూర్తి (ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛీఫ్ ) , మధు(జనరల్ డెస్క్ ) ఒకే బ్యాచ్ .
స్కూల్ తర్వాత మాకు ఈటీవీలో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ "జర్నో ముచ్చట్లు" విజయ్ గారు మాకు సీనియర్ . సూక్ష్మంగా ఇదీ నా జర్నలిజం నేపధ్యం.