Powered By Blogger

Thursday, September 30, 2010

అయోధ్య తీర్పు - అపూర్వం.


అరవై  సంవత్సరాలుగా కోర్ట్ లో నలిగిన తర్వాత అయోధ్య పై వెలువడిన తీర్పు దాదాపు గా  అందరినీ సంతోష పెట్టింది.
అలహాబాదు కోర్టు తీర్పు వెలువరించగానే, ఇరు మతస్తులు కొట్టుకు చస్తారనీ , చూసి సంతోషించొచ్చని
కోరుకున్న వాళ్లకు నిరాశే మిగిలింది. 
మన పొరుగు దేశం లో ఒకే మతస్తులే ఇమడ లేక తన్నుకుంటుంటే ,
"భిన్నత్వం లో ఏకత్వం" కేవలం మాటలకే కాదు చేతల్లో కూడా చూపించగలమని భారత పౌరులు  నిరూపించారు.
 మతసంస్తలే కాకుండా, రాజకీయ పార్టీలు కూడా ఈ తీర్పుని స్వాగతించడం ఆశ్చర్యకరమైనా, శుభపరిణామం.
హిందూ ముస్లిం భాయీ భాయీ అంటూ చేతులు కలిపిన తీరు ప్రపంచ దేశాలకు భారత్ నిజమైన ప్రజాస్వామ్య దేశమనీ,
విభేదాలు రాజకీయ పార్టీల సృష్టే తప్ప సామాన్యులందరూ  ఎప్పుడూ ఒకటేనని మరోసారి రుజువు చేసింది.

కామెంట్స్ ప్లీజ్
- శశిధర్ సంగరాజు.

Tuesday, September 28, 2010

ఆయేషా మీరా

సెప్టెంబర్ 28 2010,   రాత్రి 10 :45 EST

బహుశా, నేను ఈ ఐటెం రాసే సమయానికి ఆయేషా మీరా హత్య కేసులో కోర్ట్ తీర్పు ఇవ్వడం మొదలు పెట్టే ఉంటుంది.
ఇంతకు ముందే టీవీ లో ఆయేషా తల్లిదండ్రుల ఇంటర్వ్యూ చూసాను.
తమ కూతురు హత్య జరిగి ౩ సంవత్సరాలు గడచిన తర్వాత వెలువడుతున్న కోర్ట్ తీర్పు కూడా తమకు న్యాయం
చెయ్యదనీ, పోలీసు, న్యాయ వ్యవస్థ లు  కుమ్మక్కు అయ్యాయనీ ఆ తల్లిదండ్రులు విలపించడం చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఈ కేసులో, ఇటీవలే దివంగతులైన మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు, ఇంకొంతమంది కూడా ఉన్నారనీ, వారిని తప్పించేందుకే, పోలీసు లు సత్యం బాబు అనే అమాయకుడిని కేసులో ఇరికించారని మీడియా లో వస్తోంది.

నిజం ఏదైనా, సంపన్న వర్గాలు న్యాయ వ్యవస్థ ను ఎలాగూ నమ్మట్లేదు. వాళ్ళ లెక్కలు, సెటిల్మెంట్లు వేరేగా ఉంటున్నాయి. పేద ప్రజలు ఈ కోర్ట్ ఖర్చులు ఎలాగూ భరించలేరు. కుల పెద్దల పంచాయతీలతో వాళ్ళు సర్దుకుపోతున్నారు. ఇక మిగిలిన మధ్య తరగతి ప్రజలకు కూడా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయేలా పరిస్థితి ఉండడం దారుణం.

మీరేమంటారు,

కామెంట్స్ ప్లీజ్,

~ శశిధర్ సంగరాజు.

ఒక్క క్షణం

అందరికీ నమస్కారం,
ముందుగా నా బ్లాగ్ కు వచ్చిన మీకందరికీ  స్వాగతం.
నాకు నచ్చిన అంశాల మీద నా వ్యక్తిగత అభిప్రాయాలు, ఆలోచనలు ఇక్కడ రాస్తున్నాను.
ఎవరినీ విమర్శించడం కానీ, నొప్పించడం కానీ  నా ఉద్దేశ్యం కాదు.
మీ సలహాలు, సూచనలు,సద్విమర్శలు కామెంట్స్ ద్వారా తెలియచెయ్యండి.
తరచూ ఈ బ్లాగ్ ద్వారా మిమ్మల్ని కలుస్తూ ఉంటాను.

గమనిక: ఈ బ్లాగ్ లో వాడుతున్న ఫోటోలు , కార్టున్ లు మిగతా వెబ్ సైట్ లు లేదా వెబ్ జెన్ ల నుంచి తీసుకున్నవి. ఆ వెబ్ సైట్ ల ఓనర్ లకు  అభ్యంతరం ఉంటే, దయ చేసి తెలియజేయగలరు.వెంటనే తొలగించగలను.

మీ,
శశిధర్ సంగరాజు.