Powered By Blogger

Tuesday, October 26, 2010

'తిక్క'వరపు సుబ్బరామిరెడ్డి


 నేనెవరి గురించి రాస్తున్నానో మీకందరికీ తెలిసే వుంటుంది.   ఇంటి  పేరు లోనే 'తిక్క' ఉన్న ఈ పెద్ద మనిషి పిచ్చి ప్రేలాపన ఇప్పుడే టివి లో చూసాను. "తెలుగు లలిత కళా తోరణం" పేరు ను "రాజీవ్ తెలుగు లలిత కళా తోరణం" గా మార్చడం సమంజసం అన్నది ఈయన పిడివాదం. 

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని దిక్కుమాలిన కళా/సాంస్కృతిక సంఘాలు ఉన్నాయి. వీళ్ళ పనేంటంటే, సమాజం లో బాగా స్థితి పరులైన కొందరు పెద్దలను కాకా పట్టి, వాళ్ళ డబ్బులతోనే వాళ్లకు సన్మానాలు చేస్తుంటారు. అలాంటి సంఘాలకు డబ్బులిచ్చి సుబ్బరామిరెడ్డి గారు "కళాబంధు" (నిజంగా రాబందు)లాంటి బిరుదులు కొనుక్కున్నారు. ఈయన కళా రంగానికి సేవచేసిన మాట నిజమే గాని, ఇలా డబ్బులిచ్చి డప్పు కొట్టించుకోవడం కూడా అంతే నిజం.

సరే, ఈయన ప్రతాపం కళా రంగానికి పరిమితమైతే బాగుండేది. ఉన్నట్లుండి సోనియమ్మ ను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా 10 కోట్లు విరాళం ఇస్తాను, లలిత కళా తోరణం పేరును మార్చి "రాజీవ్" ముందు తగిలించాలని అడగడం, దానికి రోశయ్య గారు వెంటనే బట్టతల ఊపడం జరిగి పోయింది. 


టివి షో లో యాంకర్ తో ఈయన వాగ్యుద్ధం ...అసలు "తెలుగు జాతి" అనేది లేదనీ, అదొక డైలాగ్ మాత్రమేనని.ఇది నిజంగానే పిచ్చికి పరాకాష్ట.


ఈ లెక్కన రాష్ట్ర అసెంబ్లీ కీ, హైకోర్టు కు కూడా రాజీవ్, ఇందిర ల పేర్లు పెడతారేమో ఖర్మ. అన్ని రాజకీయపార్టీలు (పార్టీలకు అతీతంగా) ఈ పేరు మార్పిడి ప్రోగ్రాం ను అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


సుబ్బరామిరెడ్డి గారు నమ్ముకున్న పరమేశ్వరుడు ఆయనకు సద్భుద్ది ప్రసాదించుగాక. 

ఈ ఉన్మాదాన్ని అందరూ ఖండించండి.

~ శశిధర్ సంగరాజు.

7 comments:

ANALYSIS//అనాలిసిస్ said...

ఆయన పేరును తిక్కలోడు సుబ్బరామిరెడ్డిగా మార్చుకుంటే బాగుంటుంది లేదా సుబ్బరాజీవ్‌రెడ్డి అయితే మరీ బాగుంటుంది

రక్తచరిత్ర said...

రోశయ్య గాని కి బుద్ధి సరిగా పని చేయటం లేదు - మైండ్ కరాబు అయింది . ఎర్రగడ్డ దవాఖానా లో కే సి ర్ గాడి బెడ్ పక్కన జాయిన్ చేసి ఇద్దరికీ కలిపి షాక్ ట్రీట్ మెంట్స్ ఇవ్వాలి .

తెలంగాణా ఇస్తే కే సి ర్ కూడా రెడీ గా ఉన్నాడు "రాజీవ్ లంగాణ" గా మార్చడానికి ..యాక్ దూ ..వెధవలు ... "ఇందిరా తిరుమల, రాజీవ్ వెంకటేశ్వర స్వామి" ... గా కూడా మారుస్తారు.

ఈ సారి తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా కాంగ్రెస్ కు డిపాజిట్ votes కూడా రాకుండా ఓడిస్తాం..రాష్ట్రం నుండి కాంగ్రెస్, టి ర్ స్ ను తరిమి కొట్టాలి .

VENKATA SUBA RAO KAVURI said...

టివి షో లో యాంకర్ తో ఈయన వాగ్యుద్ధం ...అసలు "తెలుగు జాతి" అనేది లేదనీ, అదొక డైలాగ్ మాత్రమేనని.ఇది నిజంగానే పిచ్చికి పరాకాష్ట.

SatyaMurthyABN said...

ఆ ప‌ర‌మేశ్వరుడు ఆయ‌న‌కు స‌ద్బుద్ధి ప్రసాదించాడు.

Sujatha said...

Murthy,


Parameswarudu, sasidharudu.

Sasidhar said...

@మూర్తి

నీ కామెంట్స్ చూసాను. చాలా సంతోషం. రెడ్డిగారికి ఈ స్థాయిలో చివాట్లు, చీత్కారాలు ఎదురైతే తప్ప బుద్ధిరాలేదు.


@శ్రీ

మొత్తానికి నన్ను దేవుణ్ణి చేస్తున్నారు. వద్దండి బాబు, అంత శక్తి లేదు. ఇలాగుంటే చాలు.

Anonymous said...

peru meeku already undi sasi...u have no choice!!!

sree