Powered By Blogger

Wednesday, October 13, 2010

పాల్ హెన్రీ ...నోటి దురద తీరిందా?

ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే , అది మన మీదే పడుతుందన్నసత్యం..న్యూజిలాండ్ టీవీ యాంకర్ పాల్ హెన్రీ విషయం లో అక్షరాలా నిజమైంది. 

బహుశా రాత్రి హాంగోవర్ దిగలేదేమో, ఉదయం బ్రేక్ ఫాస్ట్ షోలో,
New Delhi ముఖ్య మంత్రి షీలా దీక్షిత్ పేరును వ్యంగంగా పలికి కొరివితో తల గోక్కున్నాడు. 
ఏదో, పలకడం చేతకాక పొరపాటున పలకడం కూడా కాదు, పదే, పదే దీక్షిత్ ను Dick-Shit అని పలకడం, పైపెచ్చు అదేదో పెద్ద జోక్ అయినట్లు వెటకారం గా నవ్వడం. ఈ ప్రబుద్ధుడికి గతంలో కూడా ఇలాంటి చేష్టలకు మొట్టికాయలు పడ్డాయి. అయినా ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. 

మొత్తానికి, టీవీ యాజమాన్యమే పీకేసిందో , భారత దేశం వ్యక్తం చేసిన నిరసనకు జడిసో, లేక ప్రపంచ వ్యాప్తం గా న్యూజిలాండ్ పరువు పోతుందని భయపడో,  పాల్ హెన్రీ తన ఉద్యోగానికి రాజీనామా చేసాడు.టీవీ వాళ్ళు సంతోషం గా రాజీనామాను అప్రూవ్ చేసేసారు. 

చేతులు కాలాక, ఆకులు పట్టుకున్నట్లు, అయ్యగారు ఇప్పుడు తీరిగ్గా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. తను చేసింది తప్పేనని, ఇకపై తానా ఉద్యోగం చెయ్యలేనని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. 
ఈ విషయం లో ఒక్క పాల్ హెన్రీ యే కాదు, పశ్చిమ దేశాలకు ఇతర దేశాలను, వారి సంస్కృతిని అర్థం చేసుకునే సంస్కారం ఇంకా అలవడినట్లు కనిపించడం లేదు. హిందూ దేవీ, దేవతల బొమ్మలను చెప్పులమీదా, అండర్ వేర్ ల మీద ముద్రించడం, ఆనక హిందూ సంస్థల నుంచి నిరసనలు ఎదురైన తర్వాత, ఆ బొమ్మలను తీసేయడం వీళ్ళకు పరిపాటే. అందరినీ పాల్ హెన్రీ గాటన కట్టేయలేక పోయినా , చాలా మంది లో ఇంకా ఈ జాత్యహంకార ధోరణి సమసిపోలేదు.

వీళ్ళందరికీ మంచి సంస్కారం అబ్బాలని మున్నా భాయ్ లాగ "గెట్ వెల్ సూన్ " కార్డులు పంపిద్దాం.
వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, మనకెందుకు  కార్డులు  దండగ అంటారా? అదీ పాయింటే.




~శశిధర్ సంగరాజు.














1 comment:

జర్నో ముచ్చట్లు said...

అప్రాచ్యుల జాత్యహంకార ధోరణని ఎదుర్కోవడం భారత దేశానికి ఇదే తొలిసారి కాదు.. బహుశా.. ఇదే చివరిదీ కాకపోవచ్చు. ప్రతిసారీ ఖండిస్తూనే ఉన్నా.. ఈ అప్రాచ్యుల ధోరణిలో మార్పు రావడం లేదు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రినే పాల్‌హెన్రీ ఇంత నీచంగా కామెంట్‌ చేశాడంటే.. అతడిలోని దురహంకార ధోరణి అర్థమవుతోంది. విశాల ప్రయోజనాలే పరమావధిగా ఉండాల్సిన జర్నలిజంలో.. ఇలాంటి నీచులు ఉండడం వర్కింగ్‌ జర్నలిస్టులకు తలవంపులే. మార్పు కోసం ఎదురు చూద్దాం.