Powered By Blogger

Saturday, December 18, 2010

కృష్ణ భగవాన్ - నీకిదేం బుద్ది?

నిన్న సాయంత్రం టీవిలో చూసాను, సినీ  హాస్యనటుడు కృష్ణ భగవాన్ పిచ్చి చేష్టలు. "ఏప్రిల్ ఒకటి విడుదల"
సినిమాతో నటుడిగా లైంలైట్ లో కొచ్చిన ఈయన, గోదావరి జిల్లాల యాసతో డైలాగులు చెప్పడంలో ప్రసిద్ధుడు. అంతవరకూ బాగానే ఉంది. 

ఇటీవల, నరసాపురం లో ఒక విద్యాసంస్థ, వాళ్ళ కాలేజి "ఫ్రెషర్స్ డే"  కార్యక్రమానికి ఈ ప్రభుద్దుడిని పిలిచారు, ఇంకెవరూ లేనట్లు. సరే, వచ్చినవాడు సక్రమంగా రావచ్చు కదా? తప్పతాగి మరీ వచ్చాడు. ఆ తాగి తగలడేదేదో కార్యక్రమం అయ్యాక, అఘోరించొచ్చు కదా.నాలుగు గోడల మధ్య మీరు ఎలా ఏడిస్తే ఎవరు చూడొచ్చారు గనుక. 


ముఖం ఉబ్బిపోయి, మాట తడబడుతూ, ఎబ్బెట్టుగా కనిపించే బాడీ లాంగ్వేజ్ తో మనోడు స్టేజి మీద దిష్టిబొమ్మలా తయారైయాడు.  తెలిస్తే మాట్లాడాలి, లేకపోతే, నోరుమూసుకుని కూర్చున్నట్లయితే "ఆయన అంతే, మితభాషి" అని నిర్వాహకులు సరిపెట్టుకునేవాళ్ళేమో. సమయం, సందర్భం లేని వ్యాఖ్యానాలతో పాపం పిల్లలను హడలగొట్టి పారేశాడు. ఈ వికారం అక్కడితో ఆగలేదు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, ప్రముఖ సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారిని వెటకారం చెయ్యడం మొదలెట్టాడు.


కేవలం, తెలుగు భాష కు మాత్రమే సొంతమైన అవధాన ప్రక్రియ లో, అందులోనూ ఉన్నకొద్ది మంది ప్రముఖుల్లో గరికపాటి వారు విశిష్ట స్థానాన్నిసుస్థిరం చేసుకున్న ప్రజ్ఘ్నావంతులు. ఆయనను, ఆయన విద్వత్తును వెటకారం చేసే స్థాయి, ఎవరో రాసి పెట్టిన డైలాగ్ లను చెప్పుకుని బతికే కృష్ణ భగవాన్ కు లేదు. "ఆయన ఏదో చెప్పాడు, ఎవరికి అర్థమవుతున్దీ?" అని తనదైన శైలిలో విమర్శలకు దిగాడు. గరికపాటి వారి పాండిత్యం అర్థం కావాలంటే ఒక స్థాయి ఉండాలి, కనీసం ఆస్వాదించే హృదయమైనా ఉండాలి. వాక్చాతుర్యానికీ, వాగడానికీ మధ్య అంతరం తెలియని కృష్ణ భగవాన్ కు అర్థం కాకపోవడం లో ఆశ్చర్యం ఏమీ లేదు. 

సినిమా నటుల్లో హుందాగా ప్రవర్తించేవాళ్ళు  చాలా మందే ఉన్నారు, కనీసం పబ్లిక్ లోనైనా. ముఖ్య అతిధిగా వెళ్ళే సభకు తాగి వెళ్ళాలనే దిక్కుమాలిన ఆలోచన వచ్చినందుకు కృష్ణ భగవాన్ ను అభినందించాల్సిందే. అసలే, సినిమా వాళ్ళంటే జనాలకున్న చులకన భావం ఇలాంటి వ్యక్తుల చర్యల మూలంగా ఇంకా బలపడతాయి. సినిమా వాళ్ళు ఆడవాళ్ళైతే సెక్స్ రాకేట్లలోనూ, మగవాళ్ళు డ్రగ్స్ రాకేట్లలోనూ, కొంతమంది, భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుని కోర్ట్ చుట్టూ తిరుగుతూ ఇప్పటికే పరువు పోగొట్టుకుంటున్నారు (అందరూ కాకపోయినా). ఇంకా ఇలాంటి చిల్లర చేష్టలు చేసి ప్రజల్లో పలుచన కాకండి. 


అకారణంగా, గరికపాటి నరసింహారావు గారి పట్ల అవాకులు చెవాకులు పేలిన కృష్ణ భగవాన్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని సాహితీ అభిమానులందరి తరుపునా ఈ బ్లాగ్ ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ, క్షమాపణ చెబితే, "ఏదో తాగిన మత్తులో వాగినా, కృష్ణ భగవాన్ చేసిన తప్పుకు పశ్చాత్తాపం వెలిబుచ్చాడు, సంస్కారవంతుడే!" అని అనుకుంటాం. చెప్పకపోతే, "గరికపాటి వారి వంటి గజరాజు వెళుతూ ఉంటే, కృష్ణ భగవాన్ లాంటి గ్రామ సింహాలు మొరగడం సహజమే" అని సర్ది చెప్పుకుంటాం.  ఏ కోవలోకి చెందాలనుకుంటున్నారో మీ ఇష్టం. 


~ శశిధర్ సంగరాజు.

10 comments:

యశోదకృష్ణ said...

ilanti sanghatanala valla cinema valla stayi marintha digajaruthundi

నీహారిక said...

మీరు ఈ మాట అక్కడే ఆయనని నిలదీసి ఉంటే బాగుండేది, ఇక్కడ చెప్పడం , ఆవేదన చెందడంలో అర్ధం లేదు, ప్రయోజనమూ లేదు.

Anonymous said...

Well said. Garikapati, need not care for such low level street dog.

విష్వక్సేనుడు said...

గరికపాటి వారిని అవమానించేలా మాట్లాడటం నాకు కూడా చాలా బాధ వేసింది.
మూర్ఖులకు సాహిత్య విలువలేమి తెలుస్తాయి.
ఇలాంటి వారు సినిమా ఇండస్ట్రీ కే పెను ప్రమాదం తేగలరు.
కచితంగా క్షమాపణలు చెప్పాలి.

Sasidhar said...

@గీత - యశస్వి --

@snkr --

@1092 --

మీ కామెంట్స్ కు, నాతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు. అవును, ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే.

@నీహారిక --

నేను, ఇండియాలో ఉండనండీ, నా నివాసం అమెరికాలో. ఇక, అర్థం, ప్రయోజనం అంటారా, ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతి ప్రదేశంలో మనం ఉండడం సాధ్యం అయ్యే వ్యవహారం కాదు. కానీ, ఖండించడం మన ధర్మం. కాదంటారా? మీ కామెంట్స్ కు ధన్యవాదాలు.

కెక్యూబ్ వర్మ said...

క్రిష్ణభగవాన్ ప్రవర్తన, వ్యాఖ్యలను ఖండించాల్సిందే. గరికపాటి వారికి వచ్చిన నష్టమేమీ లేదు. దీనిద్వారా ఈయన గారి అజ్నానమే బయటపడింది. అసలు ఈయనను ఆ స్థితిలో స్టేజిపైకెక్కించడమే తప్పు. సినిమా వాళ్ళు లేకుండా ఇటువంటి ఫంక్షన్స్ జరుపుకోలేమా?

Sasidhar said...

కెక్యూబ్ --


మీ కామెంట్స్ కు ధన్యవాదాలు. మీరు చెప్పంది అక్షరాలా నిజం. మనవాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో మరి.

~శశిధర్

madhu said...

asalu ilanti vaarini vidyasamsthal functions ki enduku invite cheyaali..endharo teachers untaaru kadha vaarini invite chesthe baguntundhi kadha....telugu kooda sariga maatladani vaarini invite chese dhourbhagyam eppudu pothundo..

Sasidhar said...

@Madhu--
Thanks for the comments and Well Said

~Sasidhar

Narasimharaju said...

Adento evarina educational functionski evarina goppa teachers/lecturersno pilavadam anavayithi,. Elanti Daurbhagyam pattina aa vidya samstha yajamanyanani anali. Kanakapu Simhasanamuna Shunakamunu kurchonabedithe elage untundi.Daani venukati gunamu maandad. Meeru cheppinattu Gajarajunu chusi grama simhalau moragadalu shara mamule.