Powered By Blogger

Sunday, January 2, 2011

కెలైటోస్కోప్ - రంగుల హరివిల్లు

మా ఊర్లో (లూయివిల్, కెంటకి) క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా " కెలైటోస్కోప్" అనే ప్రదర్శన ఏర్పాటు చేసారు. ఒహాయో నది వడ్డున ఉన్న "గాల్ట్ హౌస్" ప్రాంగణం లో ఈ ప్రదర్శన జరిగింది. నేను మా శ్రీమతి, పిల్లలు (సాకేత్,శ్రియ) తో కలసి వెళ్లాను. వేళ్ళు కొంకర్లు తిరిగే చలిలో కూడా నిజంగా చూడాలనిపించే రంగుల హరివిల్లు ఈ కార్యక్రమం. 


పురాతన చైనీస్ ఆర్ట్ స్పూర్తితో ఏర్పాటు చేసిన శిల్పాలు(?) లోపలకు అడుగు పెట్టగానే మమ్మల్ని కట్టి పడేశాయి.
 దూరం నుంచి చూడగానే ఈ ఆకృతులు గాజు పలకలతో చేసారేమో అనిపించాయి. తర్వాత నిర్వాహకులు చెప్పారు, ఇవి పూర్తిగా ప్రత్యేకమైన, సిల్క్ లాంటి, రంగు రంగుల బట్టలతో చేసారని. బట్టల వెనకాల నుంచి అమర్చిన కలరఫుల్ లైట్ల కాంతులు బొమ్మలకు కొత్త అందాలనిచ్చాయి.
 క్రిస్మస్, న్యూ ఇయర్ థీమ్ లతో దాదాపు 25  అంశాలను ప్రదర్శించారు. ప్రతి అంశంలోనూ, చిన్న పిల్లలకు ఆసక్తి కరంగా ఉండడానికి, కొన్ని పజిళ్ళను ఏర్పాటు చేసారు. మా సాకేత్ అన్ని పజిళ్ళను పూర్తిచేయ్యాలని పరుగులు పెట్టాడు. 
 పజిళ్ళను సకాలంలో పూర్తిచేసిన పిల్లలకు చిన్న చిన్న బహుమతులు కూడా ఇస్తారు. సాకేత్ కూడా కొన్ని బహుమతులు గెలుచుకున్నాడు. కొన్ని ఆకృతులు దాదాపు 24  అడుగుల పొడవుకూడా ఉన్నాయి.
 ఈ ఫ్లవర్  ఎగ్జిబిట్ సన్నటి ఫ్రేం మీద అమర్చారు. మంచి రంగుల కలయికతో పాటు, లైట్ కాంబినేషన్ కూడా చక్కగా అమరింది. ఫోటో లో ఉన్నది మా ఏడాదిన్నర వయసున్న శ్రియ. అన్నిటిని ముట్టుకు చూడాలని చాలా గొడవ చేసింది.
 పిరమిడ్ ల షేప్ లో ఉన్న ఈ ఆకృతి ఆప్టికల్ ఇల్లూషన్ ను కలిగిస్తాయి. ఈ పిరమిడ్ లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం పజిల్. ఏ చివరనుంచి లెక్కించినా కొన్ని మన దృష్టిని తప్పించుకుంటాయి. మనం అన్నీ లెక్క పెట్టాము అనుకుని సంతోషపడేసరికి, మన పక్కనున్న వాళ్ళు వేరే మొత్తం చెప్తారు. మళ్లీ కౌంటింగ్ మొదలు. సరదాగా గడిచిపోయింది.
  మా పిల్లలిద్దరికి ఈ ఎగ్జిబిట్ బాగా నచ్చింది. ఎంతోమంది కళాకారులు శ్రమించి సృష్టించిన ఈ రంగుల లోకం మాకు కూడా ఎంతో ఆనందాన్నిచ్చింది. 

మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తాను. 


~ శశిధర్ సంగరాజు.

4 comments:

MALLI said...

శశిధర్ గారు, మీరు కెలైటొస్కోప్ పై వ్రాసిన వ్యాసం బాగుంది. ఇలాంటివి ఉంటాయని తెలియదు. మంచుతో శిల్పాలు చెక్కటం, ఇసుకతో కళాకృతులు నిర్మించటం మాత్రమే తెలుసు. ఇవి మాత్రం చాలా రంగులతో కనువిందు చేస్తున్నాయి. ముఖ్యంగా మీ పిల్లలకు ఇవి మంచి ఆటవిడుపుని, అనుభూతిని కలిగించి ఉంటాయి. ఫోటోలు కూడా చాలా బాగున్నాయి.

Sasidhar said...

@Malli --

Thanks a lot for the comments. yes, it was a good experience to watch the sculptures.

~Sasidhar

జర్నో ముచ్చట్లు said...

శశీ
పోస్టు బావుంది. కనువిందు చేసే అక్కడి విశేషాలను చక్కగా ప్రెజెంట్‌ చేశావు. కీపిటప్‌

విజయ్

Sasidhar said...

@జర్నో...విజయ్ గారు,

చాలా థ్యాంక్సండి.
~శశిధర్