Powered By Blogger

Saturday, November 6, 2010

గరికిపాటి వారు....

నాకు,  రొటీన్ దినచర్య నుంచి కాస్త రిలీఫ్ కావాలనిపించినప్పుడు, లేదా ఎవరికోసమైనా ఎదురు చూడడమో, నా మినీ వ్యాన్ సర్విసింగ్ కు ఇచ్చినప్పుడో, ఆఖరికి ఆఫీసు లో లంచ్ బ్రేక్ లో సైతం,  కాలక్షేపానికి నేను  ఆశ్రయించే ఒకే ఒక సాధనం "యూ ట్యూబ్". నిజం గా "యూ ట్యూబ్" ద్వారా నేను పొందిన లాభాలు అన్నీ, ఇన్నీ కావు. టెక్నాలజీ నుంచి, సాహిత్యం దాకా అన్ని రంగాలను  "యూ ట్యూబ్" లో వెతికి పట్టుకుని, చూసి  ఆనందిస్తుంటాను. బోర్ కొట్టినప్పుడు టివి లో వచ్చే చెత్త ప్రోగ్రాములు చూడడం కన్నా,  "యూ ట్యూబ్" బ్రౌజ్ చెయ్యడం ఉత్తమం.

ఈ మధ్య, మా కార్ డీలర్ దగ్గర ఒక రెండు గంటల పాటు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది ( నా మినీ వ్యాన్ సర్వీసింగ్ కోసం). వెయిటింగ్ లాంజ్ , ఫైవ్ స్టార్ హోటల్ రిసెప్షన్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉంది. చక్కటి రిక్లైనింగ్ సోఫాలు, పెద్ద పెద్ద  ఎల్సిడి టివి లు , కాఫీ మెషిన్ నుంచి తయారవుతున్న తాజా కాఫీ. ఇంకేమి కావాలీ, శుభ్రంగా కాళ్ళు జాపుకుని , ఐ-ఫోన్ లో  "యూ ట్యూబ్" వెతకడం మొదలు పెట్టాను.

మనసు సాహిత్యం వైపు మళ్ళింది. వెంటనే, నాకిష్టమైన పేరు టైపు చేసాను. "గరికిపాటి నరసింహారావు" అని సెర్చ్ మొదలెట్టగానే కొన్ని వీడియోలు  వచ్చాయి. నేను క్లిక్ చేసిన మొదటి లింక్ కింద ఇస్తున్నాను. గరికిపాటి వారి పేరు, సాహితీ ప్రియులకు చిర పరిచితమే అనుకుంటాను.  సహస్రావధానిగా,కవిగా, సాహితీ వేత్తగా, బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించే గరికిపాటి వారు ఆంధ్రులవడం మన అద్రుష్టం .  మహానుభావుడు, సరస్వతీ కటాక్షం పుష్కలంగా పొందాడు. చతురతకు, భాష మీద పట్టుకు ఈయనే చిరునామా. మిగతా వారికి, ఈయనకు ఉన్న తేడా ఏమిటంటే, ఏ విషయాన్నైనా, సరళంగా, సరదాగా చెప్పడం ఈయన సొత్తు. సెల్ ఫోన్ల మీద గరికిపాటి వారి చమత్కారం చూడండి.  http://www.youtube.com/watch?v=jYyy6SVTPEY&feature=fvw

తెలుగు వన్ వెబ్ సైట్ లో ప్రసారమైన "సాహిత్యం లో హాస్యం" కార్యకమం లోనిది ఈ లింక్. ఈ సిరీస్ లోనే వచ్చిన మరికొన్ని ..
మిరపకాయ బజ్జి,
ఆంధ్రుల ఆవకాయ,
భోజరాజు సమక్షం లో కాళిదాసు చెప్పిన పద్యాలు, ఇంకా ఎన్నో, ఎన్నెన్నో...

మీకు వీలు దొరికితే "యూ ట్యూబ్" లో వెతకండి. మీ ఖాళీ సమయం తప్పకుండా సద్వినియోగం అవుతుంది.
ప్రయత్నిస్తారు కదూ,
మీ కేమైనా మంచి లింకు లు దొరికితే, నాకు కూడా పంపండి.

~శశిధర్ సంగరాజు.

4 comments:

ఎలక్ట్రాన్ said...

బాగుంది. ఆయనంటే మా తమ్ముడికి చాల ఇష్టం. కాని ఒకసారి అధునిక చలన చిత్రగీతాల్లో కుడ గొప్పకవిత్వం ఉందని చెప్తూ ఒక పాటగురించి చెప్పి దాన్ని మహాకవిత్వం అని చెప్పారు. నా మైండు పోయింది. ఏదీ దొరకనట్టు ఆపాటే ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. ఆ ఒక్క విషయంలో తప్ప ఆయనంటే నాకు కూడ ఇష్టమే. ఆయన మాటల్లో అతిశయం పాళ్ళు కొంచెం ఎక్కువే అయినప్పటికి వినేవాళ్ళకి మనోహరంగ చెప్పగలరు. ఆయన ప్రసంగం ఎంతో విజ్ఞాన దాయకమైనది.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

నేనొకసారి కడపలో ఆయన చేసిన అష్టావధానం చూశాను. చాలా బాగా చేశారు. మరీ సంస్కృతం కాకుండా ఒకమోస్తరు తెలుగు తెలిసిన వరికి కూడా అర్ధమయ్యేట్లు, అలాఅని సాహిత్యవిలువలు తేలిపోకుండా పృచ్చకులను ఎదుర్కొన్నారు.

Sasidhar said...

@sudarshan
అవును, మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఈయన కవిత్వంలో, అతిశయం ఉంటుంది. కానీ,
కవికి ఆమాత్రం అతిశయం ,వ్యంగ్యం ఉండాలేమో?

@చెప్పుదెబ్బలు....
అందరికీ అర్థమయ్యేలాగా చెపుతారు కాబట్టే, ఆయన ప్రసంగాలంటే, నాకు ఇష్టం. ఇంతకూ, మీరు కడప వాస్తవ్యులా? లేక ఏదైనా సందర్భంలో, కడప వెళ్ళినప్పుడు గరికిపాటి వారి అవధానం చూసారా?

~శశిధర్ సంగరాజు.

suhana said...

hi uncle. I am Suhana. Daughter of G.
S. Budan. visit my blog @ fairylandofsuhana.blogspot.com