Powered By Blogger

Monday, April 2, 2012

లూయివిల్ లో ఉగాది సందడి


ఏప్రిల్ 1  వ తేదీ సాయంత్రం మా ఊర్లో (లూయివిల్  ) లో తెలుగువారందరూ కలసి ఉగాది వేడుకలు జరుపుకున్నాము. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మా అబ్బాయి రెండు డాన్సు ఈవెంట్స్ లో పాల్గొన్నాడు.  నేను పత్రికలకు పంపిన చిన్న రైట్ -అప్ కూడా కింద ఇస్తున్నాను.  
*****************************************************
కెంటకీ రాష్ట్రంలోని లూయివిల్ నగరంలో ప్రవాస భారతీయులు ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెంటకియానా (టాక్) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు విరివిరిగా పాల్గొని పరస్పరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పుష్పలత పావులూరి మాట్లాడుతూ, విదేశాల్లోని తెలుగువారంతా తమ సంస్కృతీ సంప్రదాయాలను మరచిపోకుండా ప్రతి సంవత్సరం ఇలాంటి పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంస్థకు విరాళాలు అందజేసిన దాతలను సభకు పరిచయం చేసి అభినందించారు.

ఈ సందర్భంగా పలు సాంస్క్రతిక కార్యక్రమాలు జరిగాయి. సినీ గీతాలకు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీమతి సుప్రియ నృత్య దర్శకత్వంలో 22 మంది చిన్నారులు ప్ర్రదర్శించిన "శ్రీకృష్ణ లీలలు", బాబు కొండవీటి బృందం ప్రదర్శించిన "భీష్మ , కర్ణ, దుర్యోధన సంవాదం", డాక్టర్ రాజశేఖర్ లక్కరాజ్ ఆలపించిన సినీగీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఫ్రాంక్ ఫర్ట్ కుర్రాళ్ళు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను ఉర్రూతలూగించాయి.
కార్యక్రమానికి రఘు, స్వరూప్, భార్గవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కృషి చేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీని సంస్థ చైర్మన్
డాక్టర్ విజయకృష్ణ అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు బహుమతి ప్రదానం జరిగింది.
అనంతరం అతిధులకు తెలుగు వంటకాలతో కూడిన విందుభోజనం అందించారు.
************************************************
                             
                                       (గణపతి ప్రార్థన)
                                   
                                        (శ్రీ కృష్ణ  లీలలు నృత్య రూపకం)
                           
                                          (కర్ణ, దుర్యోధన, భీష్మ సంవాదం)
                                          (సాకేత్ మెడ్లీ - 1)

                                          (సాకేత్ మెడ్లీ - 2 )


~శశిధర్ సంగరాజు



4 comments:

రసజ్ఞ said...

విదేశంలో ఉండి కూడా ఇంత చక్కగా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది! చాలా ఆలస్యంగా ఉగాది శుభాకాంక్షలు! ఇవి ఫోటోలు కాకుండా వీడియోలు పెట్టుంటే ఇంకా బాగుండేది!

Sasidhar said...

Rasagna గారు,

మీ కామెంట్స్ కు ధన్యవాదాలు. ఇక్కడ అమెరికాలో పండుగలు, పబ్బాలు అన్నీ వారాంతాల్లోనే. అదేరోజు జరుపుకోవడానికి దాదాపుగా సాధ్యపడదు. మీరన్నది నిజం. ఈసారి ఉగాది కాస్త ఆలస్యం అయింది. మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు. వీడియో లింక్స్ త్వరలో పోస్ట్ చేస్తాను.

~శశిధర్.

Anonymous said...

@ఈ లెక్కన, తారాచౌదరి అరెస్టు కూడా మహిళా సాధికారత మీద జరిగిన దాడిగా గుర్తించి ఆమెను తక్షణం విడుదల చేయాలి. జిల్లాకో బ్రాంచ్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను...

ap meediaa kaburlu లో..మాంఛి..ఘాటయిన చురక అంటిచారు..బావుంది..ఇలాంటి ఉదాహరణలు ఇస్తే గానీ మన వాళ్ళ పైత్యం కుదరదు..

Sasidhar said...

@kvsv

మీ కామెంట్ కు థ్యాంక్స్. చూద్దాం, కనీసం బైఎలక్షన్లలోనైనా మన ఓటర్లు కాస్త పరిణితి చూపిస్తారేమో.

~శశిధర్