అమెరికా లో నివసించే చాలామంది భారతీయుల లాగానే, నేను కూడా తరచూ ఇండియాలోని
బంధువులతో, స్నేహితులతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాను. గత పదకొండు సంవత్సరాల్లో నేను గమనించిందేంటంటే, ఈ సంభాషణల్లో వాళ్ళు తప్పకుండా నన్ను అడిగే ఒక ప్రశ్న - "ఇప్పుడు అమెరికాలో టైం ఎంత అయింది?" అని. అమెరికా కు, ఇండియా కు ఉన్న ఈ టైం తేడా, గత ఆదివారం తో ఇంకొంచెం (ఆంటే, ఒక గంట) తగ్గింది.
అవును, ఆదివారం (నవంబర్ 7 తెల్ల వారు ఝామున, అంతే శనివారం అర్థరాత్రి తర్వాత)మేమంతా గడియారాల్లో టైం ఒక గంట వెనక్కు తిప్పుకున్నాం. అదేం పిచ్చి అనుకుంటున్నారా? అదంతే. అమెరికా లో, ఈ సంవత్సరానికి నవంబర్ 7 తో "డే లైట్ సేవింగ్స్ టైం " ముగిసింది. ఈ "డే లైట్ సేవింగ్స్ టైం " మార్చి 14 న మొదలై, నవంబర్ 7 వరకు ఉంటుంది.
అమెరికాలో స్ప్రింగ్ (వసంతకాలం)లో ఒక గంట ముందుకు, ఫాల్ (ఆకురాలేకాలం) లో ఒక గంట వెనక్కు టైం మార్చుకుంటాం.
"డే లైట్ సేవింగ్స్ టైం " ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఎండాకాలం లో సాయంకాలం ఎక్కువ సేపు వెలుతురును ఎంజాయ్ చెయ్యడం. వెలుతురు ఎక్కువ సేపు ఉంటుంది కాబట్టి,దూర ప్రాంతాలకు కార్లల్లో వెళ్ళే వాళ్లకు డ్రైవ్ చెయ్యడానికి కాస్త ఈజీ గా ఉంటుంది.
"డే లైట్ సేవింగ్స్ టైం " ముగిసిన తర్వాత అమెరికాలో ఈస్ట్ కోస్ట్ లో ఉండేవాళ్ళు, ఇండియా కన్నా పదిన్నర గంటలు వెనుక ఉంటాం. (ఈ విషయం లో మాత్రం అమెరికా ఇండియా కన్నా వెనకబడే వుంది.) ఉదాహరణకు, ఇప్పుడు అమెరికాలో శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర అయితే, ఇండియా లో శనివారం ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది.
"డే లైట్ సేవింగ్స్ టైం " లో అమెరికా కు , ఇండియా కు టైం లో ఉన్న తేడా తొమ్మిదిన్నర గంటలు. అప్పుడు అమెరికాలో శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర అయితే, ఇండియా లో శనివారం ఉదయం ఏడు గంటలు అవుతుంది.
అమెరికా లో మొత్తానికి 4 టైం జోన్స్ ఉన్నాయి. మీ సౌలభ్యం కోసం చార్ట్ కింద ఇస్తున్నాను.
ఈస్టర్న్ టైంజోన్ కన్నా పసిఫిక్ టైంజోన్ 3 గంటలు వెనక్కు ఉంటుంది.
ఈస్ట్ లో రాత్రి తొమ్మిది అయితే, సెంట్రల్ లో ఎనిమిది, మౌంటైన్ లో ఏడు, పసిఫిక్ లో ఆరు గంటలు అవుతుంది.
చార్ట్ లో కింద అలాస్కా కనిపిస్తోంది కదా, అక్కడ ఇంకో విపరీతం. సంవత్సరం లో కొన్నిరోజులు 24 గంటలు వెలుతురు , కొన్ని రోజులు 24 గంటలు చీకటి ఉంటాయి. 24 గంటలు వెలుతురు ఉన్నప్పుడు అలాస్క కు వెళ్లి చూసి రావాలన్నది నాకున్న ఒక కోరిక. తీరుతుందనే ఆశ,నమ్మకం.
అమెరికా కు వచ్చిన కొత్తలో ఈ గోల అర్థం కావడానికి నాకు ఒక సంవత్సరం పట్టింది. ఆమెరికా లోని తమ పిల్లల దగ్గరకు తరచూ వచ్చే వారికి ఈ విషయంలో కొంత అవగాహన ఉన్నా, ఇండియా లో ఉండే మిత్రులకు కొంత ఆసక్తికరంగా ఉంటుందనే భావిస్తాను.
ఇండియా, అమెరికా కన్నా భౌగోళికంగా చిన్నదవ్వడం మూలాన, మనకు ఒక టైంజోన్ తో సరిపోయింది. పాకిస్తాన్ వాళ్ళు మాత్రం, ఈ టైం ముందుకు జరుపుకునే విషయం లో అమెరికాను చూసి వాతలు పెట్టుకోబోయి, ఆనక నాలుక కరుచుకున్నారని ఎక్కడో చదివాను.
ఈ పోస్ట్ మీద మీ కామెంట్స్ తెలియజేయండి.
~ శశిధర్ సంగరాజు.
Friday, November 12, 2010
Saturday, November 6, 2010
గరికిపాటి వారు....
నాకు, రొటీన్ దినచర్య నుంచి కాస్త రిలీఫ్ కావాలనిపించినప్పుడు, లేదా ఎవరికోసమైనా ఎదురు చూడడమో, నా మినీ వ్యాన్ సర్విసింగ్ కు ఇచ్చినప్పుడో, ఆఖరికి ఆఫీసు లో లంచ్ బ్రేక్ లో సైతం, కాలక్షేపానికి నేను ఆశ్రయించే ఒకే ఒక సాధనం "యూ ట్యూబ్". నిజం గా "యూ ట్యూబ్" ద్వారా నేను పొందిన లాభాలు అన్నీ, ఇన్నీ కావు. టెక్నాలజీ నుంచి, సాహిత్యం దాకా అన్ని రంగాలను "యూ ట్యూబ్" లో వెతికి పట్టుకుని, చూసి ఆనందిస్తుంటాను. బోర్ కొట్టినప్పుడు టివి లో వచ్చే చెత్త ప్రోగ్రాములు చూడడం కన్నా, "యూ ట్యూబ్" బ్రౌజ్ చెయ్యడం ఉత్తమం.
ఈ మధ్య, మా కార్ డీలర్ దగ్గర ఒక రెండు గంటల పాటు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది ( నా మినీ వ్యాన్ సర్వీసింగ్ కోసం). వెయిటింగ్ లాంజ్ , ఫైవ్ స్టార్ హోటల్ రిసెప్షన్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉంది. చక్కటి రిక్లైనింగ్ సోఫాలు, పెద్ద పెద్ద ఎల్సిడి టివి లు , కాఫీ మెషిన్ నుంచి తయారవుతున్న తాజా కాఫీ. ఇంకేమి కావాలీ, శుభ్రంగా కాళ్ళు జాపుకుని , ఐ-ఫోన్ లో "యూ ట్యూబ్" వెతకడం మొదలు పెట్టాను.
మనసు సాహిత్యం వైపు మళ్ళింది. వెంటనే, నాకిష్టమైన పేరు టైపు చేసాను. "గరికిపాటి నరసింహారావు" అని సెర్చ్ మొదలెట్టగానే కొన్ని వీడియోలు వచ్చాయి. నేను క్లిక్ చేసిన మొదటి లింక్ కింద ఇస్తున్నాను. గరికిపాటి వారి పేరు, సాహితీ ప్రియులకు చిర పరిచితమే అనుకుంటాను. సహస్రావధానిగా,కవిగా, సాహితీ వేత్తగా, బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించే గరికిపాటి వారు ఆంధ్రులవడం మన అద్రుష్టం . మహానుభావుడు, సరస్వతీ కటాక్షం పుష్కలంగా పొందాడు. చతురతకు, భాష మీద పట్టుకు ఈయనే చిరునామా. మిగతా వారికి, ఈయనకు ఉన్న తేడా ఏమిటంటే, ఏ విషయాన్నైనా, సరళంగా, సరదాగా చెప్పడం ఈయన సొత్తు. సెల్ ఫోన్ల మీద గరికిపాటి వారి చమత్కారం చూడండి. http://www.youtube.com/watch?v=jYyy6SVTPEY&feature=fvw
తెలుగు వన్ వెబ్ సైట్ లో ప్రసారమైన "సాహిత్యం లో హాస్యం" కార్యకమం లోనిది ఈ లింక్. ఈ సిరీస్ లోనే వచ్చిన మరికొన్ని ..
మిరపకాయ బజ్జి,
ఆంధ్రుల ఆవకాయ,
భోజరాజు సమక్షం లో కాళిదాసు చెప్పిన పద్యాలు, ఇంకా ఎన్నో, ఎన్నెన్నో...
మీకు వీలు దొరికితే "యూ ట్యూబ్" లో వెతకండి. మీ ఖాళీ సమయం తప్పకుండా సద్వినియోగం అవుతుంది.
ప్రయత్నిస్తారు కదూ,
మీ కేమైనా మంచి లింకు లు దొరికితే, నాకు కూడా పంపండి.
~శశిధర్ సంగరాజు.

Thursday, November 4, 2010
దీపావళి శుభాకాంక్షలు
బ్లాగ్ మిత్రులందరికీ,
మీకు, మీ కుటుంబసభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు.
~ శశిధర్ సంగరాజు.
Sunday, October 31, 2010
లూయివిల్ లో బాలల సాంస్కృతిక కార్యక్రమాలు ....
మా ఊర్లో (లూయివిల్ ) సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పిల్లలను ఎంకరేజ్ చేయడానికి చిన్న రైట్అప్ రాస్తున్నాను. ఈ వార్తను ఈనాడు కు కూడా పంపడం జరిగింది. లింక్ ఇస్తున్నాను. http://www.eenadu.net/story.asp?qry1=28&reccount=29
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కెంటకి రాష్ట్రం లోని లూయివిల్ లో బాలల దినోత్సవం సందర్భం గా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
కెంటకియాన తెలుగు సంఘం ఆధ్వర్యం లో "ఆటల పాటల సాయంత్రం" పేరుతొ జరిగిన ఈ కార్యక్రమం లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి.
కార్యక్రమానికి రఘు కొడుమూరి,రాధిక వేమ్మిరెడ్డి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చిన్నారులు ప్రదర్శించిన "బృందావనం" నృత్యరూపకం ఆహూతుల మన్ననలు పొందింది. డాక్టర్ రాజశేఖర్ లక్కరాజ్ ఆలపించిన ఘంటసాల సినీ గీతాలు అందరిని అలరించాయి. తెలుగు జానపద గీతాలకు అమెరికన్ యువతులు చేసిన నృత్యం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఏడు సంవత్సరాల "సూపర్ జీనియస్ కిడ్" మాస్టర్ ప్రణవ్ తన అసాధారణ ప్రతిభ తో ప్రేక్షకులను ఆశ్చర్యం లో ముంచెత్తాడు. ఈ అబ్బాయి ధారణ శక్తి ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కన్నా ఎక్కువనీ, పది లక్షల మంది లో ఒక్కరికి ఇలాంటి సామర్థ్యం ఉంటుందని నిర్వాహకులు తెల్పారు (ఈ అబ్బాయి గురించి , మరో పోస్ట్ విడిగా రాయాలని ఉంది. తప్పకుండా రాస్తాను.) సంస్థ చైర్మన్ డాక్టర్ సురేష్ కొడాలి విజేతలకు బహుమతి ప్రధానం చేసారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Friday, October 29, 2010
హాలోవీన్ వచ్చేసింది...
నార్త్ అమెరికా (అమెరికా, కెనడా), యూరప్ లలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 (ఈ సంవత్సరం ఆదివారం రోజు)న హాలోవీన్ జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలు రక రకాల కాస్ట్యుంలు ధరించి సందడిగా గడిపేస్తారు. అసలీ హాలోవీన్ ఏమిటో, ఈ విచిత్ర వేషధారణ వెనకాల ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం.
కథ కమామీషు:
దశాబ్దాల నాటి చరిత్ర ఉన్న ఈ హాలోవీన్ యూరప్ లో మొదలైంది. అక్కడి వారికి ఒక నమ్మకం/మూఢ నమ్మకం ఉండేది. హాలోవీన్ రోజున, చనిపోయిన వారి ఆత్మలు భూమి మీదకు వస్తాయని. సరే, వచ్చిన ఆత్మలు ఊరికే ఉండవు కదా? తమ ఇళ్ళ దగ్గరకు వచ్చి పట్టి పీడిస్తాయని వీరి నమ్మకం. అందుకని, ఆ ఆత్మలు తమను గుర్తు పట్టకుండా, రక రకాల వేషాలు, మొహాలు కనపడకుండా మాస్కులు ధరించి, తమ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి గుంపులు గుంపులు గా తిరిగేవాళ్ళు (ట). యూరోపియన్లు అమెరికా కు వలస వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయం ఇక్కడ కూడా మొదలైంది.
దాదాపు నెల రూజుల ముందు నుంచే, షాపుల్లో వెరైటీ కాస్ట్యుంలు అమ్ముతుంటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఈ కాస్ట్యుంలు ధరించి పార్టీలకు, పెరేడ్ లకు వెళతారు.
కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగుల మధ్య కాస్ట్యుం పోటీలు నిర్వహించి, బెస్ట్ కాస్ట్యుం కు ప్రైజ్ మనీ కూడా ఇస్తారు.
ఇక పిల్లల హడావుడి కి అడ్డేముంది..సంవత్సరం ముందు నుంచే , వచ్చే హాలోవీన్ కు ఏయే కాస్ట్యుంలు కొనాలో ప్లాన్ చేసే చిచ్చర పిడుగులున్నారంటే అతిశయోక్తి కాదు.
చెక్కిన గుమ్మడి కాయ ఆకారంలో ఉన్న ఇలాంటి ప్లాస్టిక్ బకెట్ లు పట్టుకుని "ట్రిక్ ఆర్ ట్రీట్" అంటూ పరుగులు పెడతారు. ఈరోజున తమ ఇళ్ళ దగ్గరకు వచ్చే చిన్నారులకు చాక్లెట్లు, కాన్డీలు, చిన్న చిన్న ఆట బొమ్మలు పంచి పెడతారు. ఇదే "ట్రిక్ ఆర్ ట్రీట్".
మా ఇంటి దగ్గరున్న చర్చి ఆవరణలో పెరేడ్ జరుపుతారు. చర్చి వాలంటీర్లు పిల్లలు ఆడుకోవడానికి వీలుగా, ఇంఫ్లేటబుల్స్ ఏర్పాటు చేస్తారు. అందుకే, మా పిల్లలు కూడా చర్చి పెరేడ్ కు వెళ్ళడానికి బాగా ఇష్టపడతారు.
ప్రతి సరదా సందర్భం వెనుకా, ఒక ప్రమాదం ఉన్నట్లే (దీపావళి పండుగలో చేతులు కాల్చుకునే ప్రమాదం ఉన్నట్లు), ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. ముఖ్యం గా పిల్లలను "ట్రిక్ ఆర్ ట్రీట్" కు పంపేటప్పుడు.
అమెరికాలోని బ్లాగ్ మిత్రులకు కొన్ని సూచనలు:
1 ) పిల్లలను ఒంటరిగా పంపకండి.
2 ) అపరిచితుల ఇళ్ళకు, రోడ్డుకు కొంత దూరంగా, కాస్త విసిరేసినట్లు ఉండే ఇళ్ళకు అస్సలు పంపకండి.
(అపరిచితుల ఇళ్ళ దగ్గరకు పెద్దల తోడు లేకుండా వెళ్ళిన పిల్లలు ఎదుర్కునే పరిస్థితులను టివి లలో చూపుతుంటారు. వాటి వివరాల్లోకి నేను వెళ్ళదలచుకోలేదు.)
3 ) వీలున్నంత వరకూ, జనం బాగా ఉండే ప్రాంతాల్లో జరిగే పెరేడ్ లకు తీసుకెళ్ళండి. అదీ, పిల్లలను, మీ కనుచూపు మేరలో ఉండేలాగా చూసుకోండి.
దీనికి, మేము కనిపెట్టిన ఒక ఉపాయం, మా పిల్లలను చర్చి పెరేడ్ కు కానీ, దగ్గరలోని మాల్ కు కానీ తీసుకెళ్లడం. మాల్ కు వెళ్ళడం వల్ల రెండు ఉపయోగాలున్నాయి. ఇక్కడ ఎక్కువ మంది ఉండడం ఒకటైతే ,ఎలాగూ, అక్టోబర్ చివరి వారం వచ్చే సరికి వాతావరణం బాగా చల్లబడి పోతుంది. మాల్ లో అయితే, సెంట్రల్ ఎయిర్ కండీషనర్ మూలంగా వెచ్చగా ఉండడం రెండోది.
మీ దగ్గరలోని మాల్ లో సంప్రదించండి. "ట్రిక్ ఆర్ ట్రీట్" టైమింగ్స్ చెప్తారు.
ఇండియా లో కూడా ఈమధ్య కాలం లో హాలోవీన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారని విన్నాను. అది నిజమైతే,
ఇండియా లో కూడా ఈమధ్య కాలం లో హాలోవీన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారని విన్నాను. అది నిజమైతే,
మీకందరికీ , "హ్యాపీ హాలోవీన్"!
ఎంజాయ్ చెయ్యండి మరి.
~శశిధర్ సంగరాజు.
Tuesday, October 26, 2010
'తిక్క'వరపు సుబ్బరామిరెడ్డి
నేనెవరి గురించి రాస్తున్నానో మీకందరికీ తెలిసే వుంటుంది. ఇంటి పేరు లోనే 'తిక్క' ఉన్న ఈ పెద్ద మనిషి పిచ్చి ప్రేలాపన ఇప్పుడే టివి లో చూసాను. "తెలుగు లలిత కళా తోరణం" పేరు ను "రాజీవ్ తెలుగు లలిత కళా తోరణం" గా మార్చడం సమంజసం అన్నది ఈయన పిడివాదం.
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని దిక్కుమాలిన కళా/సాంస్కృతిక సంఘాలు ఉన్నాయి. వీళ్ళ పనేంటంటే, సమాజం లో బాగా స్థితి పరులైన కొందరు పెద్దలను కాకా పట్టి, వాళ్ళ డబ్బులతోనే వాళ్లకు సన్మానాలు చేస్తుంటారు. అలాంటి సంఘాలకు డబ్బులిచ్చి సుబ్బరామిరెడ్డి గారు "కళాబంధు" (నిజంగా రాబందు)లాంటి బిరుదులు కొనుక్కున్నారు. ఈయన కళా రంగానికి సేవచేసిన మాట నిజమే గాని, ఇలా డబ్బులిచ్చి డప్పు కొట్టించుకోవడం కూడా అంతే నిజం.
సరే, ఈయన ప్రతాపం కళా రంగానికి పరిమితమైతే బాగుండేది. ఉన్నట్లుండి సోనియమ్మ ను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా 10 కోట్లు విరాళం ఇస్తాను, లలిత కళా తోరణం పేరును మార్చి "రాజీవ్" ముందు తగిలించాలని అడగడం, దానికి రోశయ్య గారు వెంటనే బట్టతల ఊపడం జరిగి పోయింది.
టివి షో లో యాంకర్ తో ఈయన వాగ్యుద్ధం ...అసలు "తెలుగు జాతి" అనేది లేదనీ, అదొక డైలాగ్ మాత్రమేనని.ఇది నిజంగానే పిచ్చికి పరాకాష్ట.
ఈ లెక్కన రాష్ట్ర అసెంబ్లీ కీ, హైకోర్టు కు కూడా రాజీవ్, ఇందిర ల పేర్లు పెడతారేమో ఖర్మ. అన్ని రాజకీయపార్టీలు (పార్టీలకు అతీతంగా) ఈ పేరు మార్పిడి ప్రోగ్రాం ను అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
సుబ్బరామిరెడ్డి గారు నమ్ముకున్న పరమేశ్వరుడు ఆయనకు సద్భుద్ది ప్రసాదించుగాక.
ఈ ఉన్మాదాన్ని అందరూ ఖండించండి.
~ శశిధర్ సంగరాజు.
Friday, October 22, 2010
నన్నారి షర్బత్
కడప, ఏడురోడ్ల సెంటర్, ఈ పేరు వినగానే, ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు తప్పకుండా గుర్తుకొచ్చే మరో విషయం "బాషా కూల్ డ్రింక్ షాప్". అక్కడ దొరికే "నన్నారి షర్బత్" . ఈ నన్నారి అనే మాట రాయలసీమ వాసులకు సుపరిచితమే అనుకుంటాను. నన్నారి మొక్క వేళ్ళను ఉడికించి తయారు చేస్తారు. ఎండాకాలం లో వేడి తగ్గించే మంచి జ్యూస్. పరీక్షల టైమ్ లో మరీ.
ఏడురోడ్ల సెంటర్ నుంచి కృష్ణ - రమేష్ థియేటర్లకు వెళ్ళే దారిలో ఎడమ వైపు కార్నర్లో ఉండేది బాషా షాపు. మామూలు కూల్ డ్రింక్ షాపే. కానీ, ఎండాకాలం లో దాదాపు ప్రతి రోజు మాకు సేద తీర్చే అడ్డా.
సంవత్సరం పరీక్షలు రాసి, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేటప్పుడు నలుగురైదుగురం స్నేహితులం షాప్ దగ్గర ఆగేవాళ్ళం. బాషా అసలు పేరు ఏమిటో నాకు తెలీదు. అందరూ బాషా అనే పిలిచేవాళ్ళు. మేము పిల్లలం మాత్రం "అన్నా" అని పిలిచేవాళ్ళం.
సైకిళ్ళు స్టాండ్ వేసి, వెనకాల క్యారియర్ మీద కూర్చుని, "అన్నా, నన్నారి" అని ఆర్డరు చేసేవాళ్ళం. అప్పుడు బాషా "పరీక్షలు బాగా రాసారా?" అని అడుగుతూ నన్నారి ప్రిపరేషన్ మొదలెట్టే వాడు.
నన్నారి ప్రిపరేషన్:
ముందుగా, ఫ్రీజర్ లోంచి ఐస్ బ్లాక్ తీసి, తన చేతులు మొద్దు బారకుండా , శుభ్రమైన బట్టతో పట్టుకునేవాడు. బాషా ఎదురుగా స్టీల్ బ్లేడు బిగించిన చెక్క ఫ్రేం ఉండేది. ఐస్ బ్లాక్ ను ఆ బ్లేడ్ కు ఎదురుగా చెక్కేవాడు, కొబ్బరి తురుము లా. చెక్క కు ఉన్న కన్నం లోంచి ఐస్, పొడి, పొడి గా కింద ఉంచిన గ్లాసుల్లోకి పడేది. సగం వరకు ఐస్ పొడి నిండిన ఆ గ్లాసుల్లోకి, డార్క్ చాకలేట్ రంగులోని , నన్నారి మిశ్రమాన్ని కలిపేవాడు. దానికి పంచదార, అరచెక్క నిమ్మ రసం జత చేరేవి. గ్యాస్ తో నిండిన గోళీ సోడాను కొట్టి , గ్లాసుల్లోకి పోసేవాడు. సోడా తో కలసిన నన్నారి లేత గోధుమ రంగులోకి మారి, బుస, బుస మని పొంగేది.
అసలే, కడప ఎండలు, పైగా పరీక్షల టెన్షన్. గ్లాసును నోటి దగ్గరకు చేర్చగానే, సోడా గ్యాస్ వల్ల ఎగిరే నీటి తుంపరలు పెదవులకు తగిలి గిలిగింతలు పెట్టేవి. నన్నారి తాగుతూ, రేపటి పరీక్ష కు ఎలా ప్రిపేర్ కావాలో డిస్కస్ చేసుకునే వాళ్ళం.
నేను కడప వదిలేసి దాదాపు 15 సంవత్సరాలైంది. ఆ నన్నారి రుచి ఇంకా గుర్తుంది. అమెరికాలో దానికి ఒక ప్రత్యామ్నాయం కనిపెట్టాను. ఇక్కడ "రూట్ బీర్" (నా శీలాన్ని శంకించక్కర్లేదు. ఇది సాఫ్ట్ డ్రింక్. ) అనే డ్రింక్ దొరుకుతుంది. నన్నారి బదులు, ఈ డ్రింక్ కూడా వాడొచ్చు. కానీ, నన్నారి షర్బత్ కు ఏదీ సాటి రాదు.
6 సంవత్సరాల తర్వాత, జూలై లో కడప కు వెళ్ళాను. ఏడు రోడ్ల సెంటర్ లో బాషా షాప్ కనపడలేదు. మా నాన్న గారిని అడిగాను. రోడ్లు వెడల్పు చేసేటప్పుడు కొన్ని షాపులను తీశేసారని చెప్పారు. బాషా ఏమయ్యాడని ఎవరినీ అడగలేదు. ఏం వినాల్సొస్తుందోనని.
కడపను సింగపూర్ చెయ్యాలని, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, ఆయన మేయరు బామ్మర్ది
ప్రయత్నించిన కారణంగా, కాంట్రాక్టర్లు రోడ్లన్నీ తవ్వేసారు. ఇంకా రాళ్ళగుట్టలు అలాగే
ఉన్నాయి. ఊర్లో కొన్ని చోట్ల మరీ దారుణం.
వీళ్ళు కడపను సింగపూర్ చేస్తే సంతోషించేవాళ్ళల్లో నేనూ ఒకడిని. కానీ, కాంట్రాక్టర్లు పనిని సగంలో ఒదిలేస్తే మాత్రం, పరిస్థితి అదేదో సామెత లాగా ( "ఉన్నదీ పోయి, ...." ) అవుతుంది. సామెత నేను పూర్తి చేయక్కర్లేదు. మీకు తెలుసు.
నన్నారి షర్బత్ ట్రై చెయ్యడం మర్చిపోకండి.

Subscribe to:
Posts (Atom)