గత నెలన్నరరోజులుగా
దాదాపు ప్రతిరోజు అమెరికాలో (మిడ్ వెస్ట్, ఈస్ట్) ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తూనే ఉంది. పడిన మంచు పడినట్లుగానే ఉండగానే, పైనుంచి మంచు పడడం, ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకన్నా తక్కువ
ఊండడం వల్ల మంచు కరిగే ప్రసక్తి లేకుండా పోయింది. ఉత్తర ధృవం నుంచి వచ్చిన మంచుతుఫాను ఈ విపరీతానికి కారణంగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
దాదాపు
చాలా ప్రాంతల్లో జనజీవనం అతలాకుతలం అయిపోయింది.
రెండువారాలక్రితం అట్లాంటా నగరంలో కురిసిన మంచు వల్ల అక్కడ జనజీవనం స్థంభించడమే
కాకుండా, సకాలంలో
స్పందించని ప్రభుత్వ యంత్రాంగం పౌరుల నిరసనకూడా గురైంది.
స్థానిక స్కూళ్ళ యాజమాన్యం స్కూళ్ళు కూడా పూర్తిగా మూసెయ్యడమో, లేకపోతే ఆలస్యంగా తెరవడమో చేశారు. అనుకోకుండా వచ్చిన సెలవలను, పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తే, ఉద్యోగాలు చేసుకునే తల్లి తండ్రులు, వీళ్ళకు బేబీసిట్టర్ లను సమకూర్చుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు.
ఇప్పుడు వింటర్ ఒలంపిక్స్ జరుగుతున్న సోచి (రష్యా) కన్నా మా ఊర్లోని (లూయివిల్, కెంటకీ) ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అయ్యాయంటే, పరిస్థితి మీకు అర్థమయ్యే ఉంటుంది.
మాయింటి పరిసరాల్లో కురిసిన మంచుతో కప్పబడిన పరిసరాల ఫోటోలను తీసాను. ఈపోస్ట్ తో పాటు ఆ ఫోటోలను కూడా జతచేస్తున్నాను. చూసి ఆనందించండి.
మంచుతో నిండిన రోడ్లు.==>
<== మా యింటి ముందు భాగం.
ఐస్ వర్షం కారణంగా ఐస్ తో నిండిన చెట్టు. చూడడానికి గాజు బొమ్మలా ఉంది కదూ ==>
మంచు/ఐస్ బరువుకు వంగిపోయిన చెట్లు.
~శశిధర్ సంగరాజు.